Saturday, May 18, 2024
- Advertisement -

బొమ్మాళికి న‌డుమునొప్పాట‌

- Advertisement -
  • అందుకే కొన్నాళ్లు సినిమాల‌కు దూరం

వ‌రుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా అనుష్క శెట్టి బిజీబిజీగా గ‌డిపింది. దాదాపు రెండు, మూడేళ్లు కేవ‌లం బాహుబ‌లి ఒక‌టి, రెండు కోసం త‌న కాల్షీట్లు అన్నీ ఇచ్చేసింది. ఆ సినిమాలో నిరాటంకంగా న‌టించింది. దీనికోసం కొన్ని విద్య‌లు కూడా నేర్చుకుంది. ఆ త‌ర్వాత రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరో, ఓం న‌మో వెంక‌టేశాయ సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత నాగార్జున కోసం సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాలో చిన్న పాత్ర వేశారు.

ఈ విధంగా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న స్వీటికి తీవ్ర న‌డుము నొప్పి వ‌చ్చింద‌ట‌. ‘భాగమతి’ సినిమా షూటింగ్ త‌ర్వాత ఇప్పటివరకు అనుష్క మరో కొత్త సినిమాకి అనుష్క సంతకం చేయలేదు. నిర్విరామంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అనుష్క తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్నారట. ఇందుకోసం నేచురల్‌ థెరపీతో చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. చికిత్స పూర్తవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఏ సినిమాలకు సంతకం చేయడం లేదని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం అనుష్క ‘భాగమతి’ ఫస్ట్‌లుక్‌ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకి అశోక్‌ దర్శకుడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -