Sunday, May 19, 2024
- Advertisement -

మళ్ళీ అనుష్క తో నాగార్జున ..

- Advertisement -

వెండితెరపై కొన్ని కాంబినేషన్స్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబోల్లో కింగ్ నాగార్జున, స్వీటీ అనుష్క జంట కూడా ఒకటని చెప్పొచ్చు. అందుకే ఈ జంటను పదే పదే రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన దర్శక-నిర్మాతలు. ‘సూపర్’ సినిమాతో మొదలైన నాగ్-అనుష్క వెండితెర బంధం ఇంకా కొనసాగతునే ఉంది.

దాంతో మన్మథుడికీ స్వీటీ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు కలసి నటించకపోయినా.. ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ఇటీవలే వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి చిత్రాల్లో అనుష్క గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వగా.. అనుష్క ‘సైజ్ జీరో’లో నాగ్ అతిథిపాత్రలో మెరిశాడు.

ఇక తాజాగా నాగ్ కొత్త చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’లోనూ అమ్మడిని ఓ కీ రోల్ కోసం తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఈ భక్తిరస చిత్రం పై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి మరోసారి భక్తుడిగా నాగ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -