Friday, May 3, 2024
- Advertisement -

సన్యాసిగా అనుష్క

- Advertisement -

అందాల ముద్దుగుమ్మ అనుష్క ఏంటి సన్యాసిగా మారడమేంటని ఆశ్చర్యపోతున్నారా… ఎలాంటి పాత్ర అయినా దానికి న్యాయం చేస్తుంది అనుష్క.. నాగార్జున కథానాయకుడిగా కె.రాఘవేంద్రరారు దర్శకత్వంలో ’ఓం నమోవెంకటేశాయ’ అనే చిత్రం  తెరకెక్కబోతోంది.

అందులో నాగార్జన హథీరాంబాబాగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా అనుష్కని ఎంపిక చేసుకొన్నారని, ఇందులో సన్యాసిని పాత్ర లో నటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఇప్పటికే అనుష్క కు సంబంధించిన కాస్ట్యూమ్స్, గెటప్ కూడా ఫైనల్ చేశారట. కాషాయ వస్త్రాల్లో అనుష్క ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఇప్పటినుంచే మొదలైంది. ఇదే చిత్రంలో ప్రగ్న్యా జైశ్వాల్, విమలా రామన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విమలా రామన్ పద్మావతీ దేవిగా కనిపిస్తుందట. శ్రీవారి పాత్రలో మహాభారత కృష్ణుడు సౌరభ్ నటించనున్నట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది.

ప్రస్తుతం అనుష్క బాహుబలి 2తో పాటు, సింగం 3 చిత్రం కోసం బిజీగా మారింది. దీని తర్వాత అశోక్ దర్శకత్వం వహించే భాగమతి చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటే నాగార్జున చిత్రంలోనూ నటించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఏది ఏమైనా.. అటు గ్లామరస్ రోల్స్ చేస్తూనే… ఇటు… నటించేందుకు ఆస్కారమున్న పాత్రల్లోనూ కనిపిస్తూ… తన అభిమానుల్ని అలరిస్తోంది అనుష్క.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -