Saturday, May 18, 2024
- Advertisement -

రాములమ్మ రాజకీయం ఎటువైపు!

- Advertisement -

ఒకప్పుడు మెదక్ ఎంపీగా.. కేసీఆర్ కు చెల్లెలిగా ఉన్న లేడీ అమితాబ్.. విజయశాంతి.. తర్వాత టీఆర్ఎస్ నుంచి మెల్లగా సైడ్ అయిపోయారు. ఇందుకు కారణం ఎవరు అన్న విషయాన్ని పక్కన పెడితే.. విజయశాంతి మాత్రం పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకోలేదు.

చాన్స్ దొరికితే.. మళ్లీ జనంలోకి వచ్చేద్దాం అనుకున్నట్టు.. కాస్త సైలెంట్ గా ఉన్నారంతే. అయితే.. ఇన్నాళ్లకు విజయశాంతికి ఆ అవకాశం దొరికినట్టుంది. అందుకే.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఊహాగానాలే నిజమై.. విజయశాంతి నిజంగానే రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయితే.. ఆమె టార్గెట్ ఎవరు? ఏ పార్టీ నుంచి పోరాటం చేస్తారు? ఎవరి కోసం చేస్తారు? అన్న ప్రశ్నలకు మాత్రం జవాబులు దొరకడం లేదు. టీఆర్ఎస్ నుంచి తీవ్ర అసంతృప్తితోనే విజయశాంతి బయటికి వెళ్లిపోయినట్టు అప్పట్టలో వార్తలు వచ్చాయి. దీంతో.. కేసీఆర్ పైనే రాములమ్మ పోరాటం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ.. అదే కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నాయన్న విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.

ఎందుకంటే.. 119 అసెంబ్లీ సీట్లున్న తెలంగాణలో.. ఇప్పటికే 90 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్నారు. మిగిలిన 29 మందిలో.. చాలా మంది కేసీఆర్ వైపే చూస్తున్నట్టు ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో.. కేసీఆర్ కు వ్యతిరేకంగా రాములమ్మ పోరాటం చేయలేదని కొందరు వాదిస్తున్నారు. ఎలాగూ కాంగ్రెస్ ను నమ్ముకునే పరిస్థితి లేదు.. రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేని టీడీపీలో చేరే అవకాశం లేదు. ఈ రెండూ కాకుంటే.. అయితే టీఆర్ఎస్, లేదంటే బీజేపీ. ఈ రెండు పార్టీల్లో ఎవరితో విజయశాంతి అడుగులు వేస్తారన్నదే.. ఆమె అభిమానుల్లో చర్చకు కారణమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -