Thursday, May 9, 2024
- Advertisement -

అనుష్క భాగమతి ఫస్ట్ లుక్‌

- Advertisement -

బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న హైలీ ఎక్స్ పెక్టెడ్ మూవీ భాగమతి ఫస్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్‌. నవంబరు 7వ తేదీ హీరోయిన్ అనుష్క బర్త్ డే కావడంతో.. ఆమె పుట్టిన రోజు గిఫ్ట్ గా ఫస్ట్ లుక్ అభిమానుల ముందుకు వ‌చ్చింది.

డార్క్ బ్రౌన్ కలర్ థీమ్ తో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. పురాతనమైనదిగా కనిపించే భవనం వద్ద.. అనుష్క నిల్చున్నట్లుగా పోస్టర్ ఉంటుంది. చేతి మణికట్టు వరకు ఉన్న పొడవు చేతుల చుడీదార్… డార్క్ బ్రౌన్ కలర్ లో చాలా డిఫరెంట్ గా ఉన్న దుస్తుల్లో ఈ పోస్టర్ లో అనుష్క క‌నిపిస్తోంది.భుజాల మీదుగా రెండు వైపులా ముందుకు విరబోసుకున్న రింగుల జుటుతో, తల కొద్దిగా ముందుకు వంచి.. కనుగుడ్లు పైకెత్తి సూటిగా, ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రంగా, మనకేసి చూస్తున్నట్లుగా అనుష్క ఈ పోస్టర్ లో మనకు కనిపిస్తుంది.

ఎడమచేతిని అభివాదం చేస్తున్న భంగిమలో పైకెత్తి పట్టుకుని.. కుడిచేతిలో సుత్తి వంటి పరికరాన్ని పట్టుకుని.. అనుష్క ఈ ఫస్ట్ లుక్ లో చాలా డిఫరెంట్ గాఉంది భాగమ‌తి ఫ‌స్ట్‌లుక్ అదిరింది.

https://www.youtube.com/watch?v=0i0ANScZof8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -