Sunday, May 4, 2025
- Advertisement -

పవన్ కల్యాణ్ ను మళ్లీ టార్గెట్ చేసిన ఏపీ సర్కార్

- Advertisement -

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఏపీ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందా ? భీమ్లా నాయక్ సినిమాను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు సాగిస్తోందా ? ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. రెండు వారాల పాటు ఐదో షోకి అనుమతి ఇస్తున్నట్లుగా ఒక పక్క ప్రత్యేక జీవోని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తే…మరోపక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ చిత్రంపై కక్షపూరిత వాతావరణమే కనబడుతోంది.

బీమ్లా నాయక్ టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని థియేటర్ల యజమానులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. టికెట్ రేట్లు పెంచి విక్రయిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. గతంలో వకీల్సాబ్ సినిమా విడుదలకు ముందు…టికెట్ రేట్లను తగ్గిస్తూ.. వైసీపీ ప్రభుత్వం అప్పట్లో జీవో విడుదల చేసింది. టికెట్ ధరల పెంపుపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రిలీజ్ చేయలేదు.

తాజాగా ఏపీలోని కొన్ని జిల్లాలలో ‘భీమ్లా నాయక్’ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించడమే కాకుండా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా చేశారని సమాచారం. పాత ధరలకే టికెట్లు విక్రయించాలంటూ కొందరు ఎగ్జిబిటర్లకు అధికారులు ఫోన్లు కూడా చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేసిన ప్రియామ‌ణి

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -