హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

- Advertisement -

ప్రేమ.. ఎప్పుడు ఎలా చిగురిస్తుందో చెప్పలేం. అది ఎప్పుడో బ్రేకప్‌ అవుతుందో కూడా మనం ఊహించలేం. ప్రత్యేకించి సినీ నటీనటుల మధ్య ప్యార్‌ మొదలవ్వడం.. కొద్దిరోజులకే బ్రేకప్‌ చెప్పుకోవడం కామన్‌ అయింది. కొందరైతే ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే క్రమంలో ఎంగేజ్‌ మెంట్‌ తోటే పుల్‌ స్టాప్‌ పెడుతున్నారు. ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. ఈ మూడు పదాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది వెరీ కామన్‌ అయింది. యూట్యూబ్‌ స్టార్‌స్‌ దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ వార్త కొద్దిరోజులు ట్రెండింగ్‌ లో నిలిచింది. దాదాపు ఐదేళ్లుగా ప్రేమాయణం సాగించిన ఈ జంట విడిపోయింది.

బిగ్‌ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో సిరి హన్మంత్‌తో రొమాన్స్ చేయడం వల్ల షణ్ముఖ్ జస్వంత్- దీప్తి సునయనల మధ్య గ్యాప్‌ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ జంట విడిపోయిందని నెట్టింట తెగ ప్రచారమే జరిగింది. రీసెంట్‌ గా టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య-సమంతల వివాహం 2017 అక్టోబర్‌ 7న జరిగింది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2021లో విడిపోయారు. అఖిల్ అక్కినేని -శ్రీయ భూపాల్ బ్రేకప్ కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అఖిల్ అక్కినేని-శ్రీయ భూపాల్ జంట రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత నిశ్చితార్థం చేసుకున్నారు. రకరకాల కారణాల వల్ల ఈ జంట పెళ్లి రద్దయ్యింది.

తరువాత శ్రీయా భూపాల్ జూలై 2018 లో వివాహం చేసుకున్నారు. అక్కినేని హీరో సుమంత్‌, నటి కీర్తిరెడ్డిలది ప్రేమ వివాహం. అయితే ఆ బంధం ఎంతో కాలం నిల‌వ‌లేదు. ప్రేమించి, పెళ్లి చేసుకున్నా రెండేళ్లు కూడా వారు క‌లిసి ఉండలేక‌పోయారు. సుమంత్‌తో విడాకులు తీసుకున్న కీర్తి మ‌రో వ్య‌కిని పెళ్లి చేసుకుని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయింది. సుమంత్ మాత్రం మ‌రో పెళ్లి చేసుకోలేదు. మొత్తంగా లవ్‌.. బ్రేకప్‌. నిశ్చితార్థం.. క్యాన్సిల్‌ ఇలా పీటల వరకు రాకుండానే కొందరు సెలబ్రిటీస్ పెళ్లిళ్లను ఆపేశారు. నిశ్చితార్థాన్ని కూడా పక్కన పెట్టేసి కొందరు ఏడడుగులు నడిచారు. మరికొందరు మాత్రం జరిగిన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇప్పటికీ సింగిల్‌గానే మిగిలిపోయారు. మొత్తంగా మూడుముళ్లు.. ఏడడుగులతో నడక ప్రారంభించే నవజంటలు కొన్ని చివరి మజిలీ చేరకనే అర్ధాంతరంగా విడిపోతున్నాయి.

రీల్ జంటలు రియల్ లైఫ్ లో ఒక్కటైన హీరో, హీరోయిన్లు..!

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -