Friday, March 29, 2024
- Advertisement -

సైరాకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పిక్చర్ ” సైరా ” నుంచి తాను కూడా సైడ్ అవుతున్నానని అంతర్జాతీయ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ అనౌన్స్ చేశాడు. తన మ్యూజిక్ లైవ్ షో కోసం హైదరాబాద్ వచ్చిన రెహమాన్ ఇదే మ్యాటర్ ను కన్ఫామ్ చేశాడు. చిరు నిజంగా గొప్ప నటుడని,బట్ తాను బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవల్సి వస్తుందని తెలిపారు.

రెహమాన్ ఇలా సైడ్ కావడానికి మరో కారణం…మిగతా సినిమాలకు సంగీత దర్శకునిగా పని చేస్తుండడంతో బాటు..తన సొంత మూవీ “99 సాంగ్స్” చిత్రీకరణలో రెహమాన్ బిజీగా ఉండటమే. ఇప్పటికే ” సైరా ” మూవీ సినిమాటో గ్రాఫర్ గా అనుకున్న రవివర్మన్ పేరును ప్రకటించిన నిర్మాణ టీ మ్.. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవడంతో ఆ స్థానంలో రత్నవేలును ఎంపిక చేసారు. మరి ఎ.ఆర్.రెహమాన్ ప్లేస్ ను ఎవరితో రీప్లేస్ చేస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -