Friday, May 10, 2024
- Advertisement -

లీకైన అజ్ఞాతవాసి ‘కథ’. ఇదే ఆ స్టోరి

- Advertisement -

టైటిల్ ఏం పెడతారో చెప్పకుండా ఇంతకాలం అభిమానులను భాధపెట్టి లాస్ట్ మినిట్లో ఓపెన్ అయిన పి.యస్.పి.కె. 25 ఫిలిం టైటిల్ ఓకే అయింది.టైటిల్ ‘అజ్ఞాతవాసి’అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ఇదేనని గత కొంతకాలం ప్రచారం సాగింది.జనాల సెంటిమెంట్ ను ఎందుకు కాదంటాం అని చివరకు దానినే ఫైనలైజ్ చేశారు.

ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పవన్ లుక్ డిఫరెంట్‌గా వుంది. చేతిలో ఐడీ కార్డు తిప్పుతూ పవన్ యూత్ ఫుల్ గా కలరింగ్ ఇవ్వడంతో.. ఇందులో కచ్చితంగా టెక్కీ రోల్ చేస్తున్నాడని అభిమానులు అప్పుడే ఓ అంచనాకి వచ్చేశారు. ఫస్ట్ పోస్టర్ తో స్టోరీ లైన్ ని కూడా కొద్దిగా రివీల్ చేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్. అది ఎలాగంటే… టైటిల్ కిందున్న ‘ప్రిన్స్ ఇన్ ఎక్సయిల్’ అనే ట్యాగ్ లైన్ నుంచి ‘దేశబహిష్కారానికి గురైన రాకుమారుడు’ అనే అర్థాన్ని తీసుకుంటున్నారు నెటిజన్లు. విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉంటూ.. అక్కడి ఎన్నారై యువకుల సమస్యల కోసం పోరాడే కథను ‘అజ్ఞాతవాసి’లో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.

ఇంతవరకూ బయటి ప్రాంతాలనగా గల్ఫ్ దేశాల్లో బాధలు పడే వారి గురించి సినిమాలు వచ్చాయి గాని…. అమెరికా ,యుకె దేశాలలో సెటిలైన తెలుగు వాళ్ళ మీద సినిమాలు రాలేదు. విదేశాల్లో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు బ్యాక్ బోన్ గా ఉంటూ చెలరేగిపోయే పాత్రలో పవన్ నటించినట్లు ‘టాక్’ నడుస్తోంది.అదే గనుక నిజమైతే ఎన్ ఆర్ ఐ బ్యాంక్ నే పవన్ టార్గెట్ చేసినట్లుగా కన్ఫామ్ చేసుకోవచ్చు.

https://www.youtube.com/watch?v=v1EmSCQJnGs&t=27s

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -