Thursday, May 16, 2024
- Advertisement -

100 కోట్ల క్ల‌బ్‌లో ‘అర‌వింద స‌మేత‌’

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా విడుద‌లైన మొద‌టి రోజు నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.సినిమా విడుద‌లైన మూడు రోజుల్లోనే 100 కోట్లు సాధించ‌డం విశేషం.ఎన్టీఆర్‌కు ఇది మూడో 100 కోట్ల సినిమా.అంత‌క‌ముందు జ‌న‌తా గ్యారేజ్‌,జై ల‌వ‌కుశ సినిమాలు 100 కోట్లు సాధించాయి.ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది.

అర‌వింద స‌మేత ఫస్ట్ డే నాన్ బాహుబ‌లి రికార్డుగాల‌ను బ‌ద్ద‌లు కొట్టింది.ఈ సినిమా మొద‌టి రోజున 60 కోట్లు సాధించింద‌ని చిత్ర నిర్మాత‌లు చెబుతున్నారు.ఇక ఈ సినిమా యూఎస్‌లో కూడా మంచి విజ‌యం సాధించింది.అక్క‌డ ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్‌పైగా సాధించింద‌ని తెలుస్తుంది.ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు ట‌చ్ చేయ‌ని ఫ్యాక్ష‌న్ క‌థ‌ను త్రివిక్ర‌మ్ అద్భ‌తంగా తెర‌కెక్కించాడని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు.ఎన్టీఆర్ న‌ట‌న‌కు తోడు పూజా హెగ్డె గ్లామ‌ర్ సినిమా విజ‌యానికి బాగా హెల్ప్ అయింది.లాంగ్ ర‌న్‌లో ఈ సినిమా 200 కోట్లు సాధింస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -