Sunday, May 5, 2024
- Advertisement -

అర‌వింద స‌మేత.. అందానికి సొంతూరు.. అందుకనే ఆ పొగరు అంటూ ఫ‌స్ట్‌సాంగ్ 

- Advertisement -

రఫ్‌గా కనిపిస్తారు కాని.. మాట వింటారు.. పర్లేదు.. అన్న పూజా హెగ్డే డైలాగ్‌కి అనగనగనగా అరవిందట తన పేరు.. అందానికి సొంతూరు.. అందుకనే ఆ పొగరు..’ అంటూ ‘అరవింద సమేత’ సినిమాలో సాగే పాటను ఈరోజు విడుదల చేసింది చిత్రబృందం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

చీకటి లాంటి పగటి పూట.. కత్తుల్లాంటి పూలతోట.. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటావా.. అనగనగనగా.. అరవిందట తన పేరు’ అనే టైటిల్ సాంగ్‌తో వచ్చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఎన్టీఆర్, పూజా హెగ్డే జోడిగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు చిత్ర యూనిట్. ‘అనగనగనగా’ అంటూ సాగిన ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా.. అర్మన్ మాలిక్ ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.

ఈ నెల 20న సినిమా ఆడియో ఫంక్షన్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ముందుగానే మార్కెట్ లోకి పాటలను విడుదల చేసి సింపుల్ గా స్టేజ్ మీద ఫంక్షన్ చేయాలని భావిస్తున్నారు. తాజా సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -