Saturday, May 11, 2024
- Advertisement -

నాగార్జున, తారక్, వ‌రుణ్‌తేజ్, అనుష్క రిస్క్ చేస్తున్నారా..?

- Advertisement -

టాలీవుడ్ టాప్ స్టార్స్ తమ పాత్రలతో రిస్క్ చేస్తున్నారు. మాంచి టైమ్లో….. డీ గ్లామరైజ్డ్ రోల్స్ తో అభిమానులను ఇబ్బంది పెడుతున్నారు. తెలుగు ప్రేక్షకుడికి అరవోడి టేస్ట్ ను రుచి చూపిస్తామంటున్నారు. దీంతో వీరి అప్ కమింగ్ చిత్రాల మార్కెట్ కాస్త సందిగ్దంలో పడింది.  విషయంలోకి వెళ్దాం. 

టాలీవుడ్ టాప్ స్టార్సంతా …  ఇప్పుడు ప్రయోగాల బాట ప‌ట్టారు. రొటీన్‌కి భిన్నంగా విభిన్నమైన పాత్రల‌తో సిద్ధమ‌వుతున్నారు . సీనియ‌ర్ హీరో నాగార్జున హీరో కార్తీతో క‌లిసి న‌టిస్తున్న మూవీలో వీల్‌ చైర్‌లోనే ఎక్కువ సేపు ఉంటాడట‌. మరి ఈ సినిమాలో నాగ్ ఇలా వీల్ చైర్ కు అంకితమైపోతే…ప్రేక్షకులు అంత సేపు ఓపిక పట్టి అతన్ని ఎంత వరకూ రిసీవ్ చేసుకుంటారనేది సందేహంగా కనిపిస్తుంది. 

 ఇక తారక్ నాన్నకు ప్రేమతో చిత్రంలో లాంగ్ లెన్త్  గా చేయబోయే గెడ్డం రోల్ చూస్తే… కాస్త కష్టంగానే అనిపించొచ్చు. పబ్లిక్ కు ఇలాంటి గెటప్ ను అంత సేపు చూసేటంత ఓపిక లేదు. సో మరి తారక్ ఏ విధంగా కవ్విస్తాడనేది చూడాలి.  

అలాగే వ‌రుణ్‌తేజ్ తో  రూపొందుతున్న కంచె మూవీ… పూర్తిగా  సెకండ్ వ‌ర‌ల్డ్ వార్ నాటిది. మ‌రి అంత పాత కాలం నాటి మూవీగా తీసి, అదే స్టైల్‌తో హీరో క‌నిపిస్తే జ‌నానికి ఏమేరకు న‌చ్చుతుంద‌నేది చూడాలి.ఎందుకంటే వరుణ్ తేజ్ ను పూర్తి స్థాయిలో అప్పటి హీరోగా చూడమంటే ఇపుడున్న టైమ్లో ఎంత వరకు చూస్తారనేది ప్రశ్నే.ఒక వేల ఇప్పటి కాలానికి తగ్గట్లుగా ఏమైనా సీన్స్ కూడా యాడ్ చేస్తే జనాలకు  సినిమా కొంత వరకూ ఎక్కొచ్చు.

 నాగ్ ,తారక్ ,కార్తిల మ్యాటర్ ఇలా ఉంటే…. స్వీటీ అనుష్క న‌టిస్తున్న మూవీ మ‌రీ ప్రత్యేకం. సైజ్ జీరో పేరుతో వ‌స్తున్న ఈ మూవీలో అనుష్క మ‌రీ లావుగా క‌నిపిస్తోంది. ఇలాంటి ప్రయోగాల‌న్నీ ఆన్ స్క్రీన్‌పై జ‌నాలకు నచ్చేవి కాదు.మన వాళ్లు ఇంకా అరవోళ్లంతగా గొప్పగా ఆలోచించరు కాబట్టి….రిసీవ్ చూసుకోవడం కష్టమే.

ఏది ఏమైనా ఈమధ్యకాలంలో టాప్ స్టార్స్ అంతా ఇలా రిస్క్ ఫ్యాక్టర్ తో ఆడుకోవడం ఛాలెంజే అనుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -