Friday, May 10, 2024
- Advertisement -

రెడ్డి,రావు,శర్మల తోకలు తొక్కిన బాల్క సుమన్

- Advertisement -

భౌగోళిక తెలంగాణ సాధించుకున్నారు గాని…సామాజిక తెలంగాణ సాధన అనుకున్నంత వీజీ కాదు. ఎందుకంటే కోస్తానుంచి రోగాలుగా వచ్చినటువంటి ….. కుల వన భోజనాలు, కుల సంఘాలు ఇక్కడి వారికి భాగా వంట భట్టేశాయి.

గతంలో ఎన్నడూ లేనంతగా…. ఇపుడు తెలంగాణలో కొందరు మాటకు ముందు,వెనుక… కులం తోకను చూసి స్పందించే పరిస్థితి వచ్చేసిందనేది రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు బట్టి తెలుస్తోంది.

 మొన్న ఉద్యోగుల సంఘం నేత  శ్రీనివాస్ గౌడ్ , నిన్న కరీం నగర్ లోకసభ సభ్యుడు , ఉద్యమ నేత అయినటువంటి బాల్కన్ సుమన్ ఇదే విషయంలో తమ ఆవేదనని వ్యక్తం చేశారు.కరీంనగర్  జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో ఈటెల రాజేందర్ , సీనియర్ లోకసభ సభ్యుడు వినోద్ సమక్షం లో బాల్క సుమన్ కులం తోకలకు నిప్పంటించినంత పని చేశారు.

సుమన్ మాట్లాడుతూ…. తన పేరు చివర రెడ్డి , రావు,శర్మ  లేవనే ఒక్క కారణం తో నన్ను ఇలా అవమానిస్తున్నారని , నా నియోజకవర్గంలో జరిగే…. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. నేను ఓ దళితుడిని అయినందునే….  నన్ను ప్రభుత్వాధికారులు ఇలా అవమానిస్తూ తగిన గుర్తింపు ఇవ్వడంలేదని…. తనకే న్యాయం జరగనప్పుడు  తన సామజిక వర్గానికి ఏం న్యాయం చేస్తారో అధికార యంత్రంగం చెప్పాలని ఎదురు ప్రశ్నించారు . 

ఈ సమావేశానికి తాను  వాకౌట్ చేయాలని వచ్చానని ….కానీ ఇక్కడున్న పెద్దలు , మంత్రులు , సీనియర్స్ ఉన్నారని ఇంకా ఉన్నానని ఇకనైన అధికారుల తీరు మారాలని  బంగారు తెలంగాణలో జాతి,కుల బేధాలు చూపకుండా అందరూ కలిసికట్టుగా పని చేయాలనీ బాల్క సుమన్ ఆవేదనతో కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -