Tuesday, May 14, 2024
- Advertisement -

బాహుబలి వాటర్ ఫాల్స్‌ సీన్స్‌ను రాజమౌళి ఆ సినిమా నుంచి కాపీ కొట్టాడా?!

- Advertisement -

బాహుబలి సినిమా విడుదలై పది రోజులు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే జనాలు కొంత తేరుకొంటున్నారు. ఈ సినిమా మానియా కొంచెం తగ్గుముఖం పట్టింది. తెలుగు సినిమాలేవీ బాహుబలి తర్వాత ఇంకా విడుదలక కాకపోయినా..

బాలీవుడ్ సినిమా భజరంగీ భాయ్ జాన్ సిటీ జనాలపై ప్రభావం చూపుతోంది. దీంతో బాహుబలి మానియా కొంత తగ్గుముఖం పట్టింది. ఇక బాహుబలి కలెక్షన్ల లెక్కలు వింటూనే ఉన్నాం. ఈ సినిమా వసూళ్ల గురించి పెద్ద పెద్ద నంబర్లు వినిపిస్తున్నాయి.

మరి ఇప్పుడు బాహుబలి గురించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ సినిమా కథాంశాన్ని కాపీ కొట్టారనే ఆరోపణల వస్తోంది. 1986లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ది మిషన్’ కాన్సెప్ట్ ను బాహుబలి కోసం తస్కరించారని ఆరోపణ. ఆ సినిమాను వార్నర్ బ్రదర్స్ వారు రూపొందించారు. ఆ సినిమా కథాంశానికి.. బాహుబలికి పోలిక ఉందని అంటున్నారు. బాహుబలిలో ప్రభాస్ పాత్రలాగే  ఆ సినిమాలో కూడా హీరో పాత్ర ఉంటుంది.

తాము నివసించే ప్రాంతానికి పక్కనే ఉండే పెద్ద జలపాతం అవతల ఏముంది? అనేది తెలుసుకోవడంఆ ఆ పాత్రకు ఉండే ఆసక్తి. ఆ జలపాతం అవతల ఏముందో తెలుసుకోవాలనే ప్రయత్నంలో అతడు ఒక మైథలాజికల్ మిస్టరీని ఛేదిస్తాడు. అచ్చం బాహుబలిలో కూడా ఇలాగే ఉంటుంది. దీంతో 1986లో వచ్చిన ఆ సినిమా కథాంశాన్నే రాజమౌళి అండ్ కో కాపీ కొట్టిందని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రచారం జరుగుతోంది. మరి అసలు కథ ఏమిటో..! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -