- Advertisement -

లండన్‌లో ఎన్‌టిఆర్, తనయుని విహారం!

- Advertisement -

ఎన్‌టిఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ షూటింగ్‌ షెడ్యూల్ పరంగా, టీం మొత్తం లండన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఎన్‌టిఆర్ కుమారుడు అభయ్‌రామ్, తండ్రి ఎన్‌టిఆర్‌ తో కలిసి ఆడుకుంటున్న ఫోటో సోషల్ నెట్‌వర్క్‌లో హల్ చల్ చేస్తోంది.

ఈ ఫోటోను చూసిన ఎన్‌టిఆర్ అభిమానులు చూసి ఫేస్‌బుక్‌లో లైక్స్, షేర్స్ చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముద్దుముద్దుగా ఉన్న అభయ్‌ని ఎన్‌టిఆర్‌ తాజా సినిమాలో కనిపించబోతున్నాడా అన్న కోణంలో అభిమానులు కామెంట్స్ చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే లండన్‌ సినిమా షూటింగ్‌ తీసుకెళ్ళారేమో అని ఫిల్మ్ వర్గాల సమాచారం.

ఇది నిజమో కాదో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాలి మరి. కానీ అభయ్‌రామ్ బర్త్‌డే కోసం మాత్రమే అక్కడికి వెళ్ళారట. ఈరోజు  ఎన్‌టిఆర్ తన కొడుకు బర్త్‌డేని సినిమా యూనిట్‌ సభ్యులతో కలిసి లండన్‌లో సెలబ్రేట్ చేశారు.   

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -