Wednesday, May 15, 2024
- Advertisement -

కోలీవుడ్‌లోకి అర్జున్‌రెడ్డి హీరోయిన్‌

- Advertisement -

ఒక్క సినిమా తెలుగు సినీ ప్ర‌పంచంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సినిమా అర్జున్‌రెడ్డి. ఈ సినిమాతో హీరో, హీరోయిన్లు బంపరాఫ‌ర్లు అందుకుంటున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ చేతిలో దాదాపు ఐదారు సినిమాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో న‌టించిన హీరోయిన్ శాలినీ పాండే త‌మిళ్‌లో మంచి అవ‌కాశం పొందింది.

తెలుగులో వరుస సినిమాలకు అంగీక‌రించిన శాలినీ పాండే తన సత్తా చాటుతోంది. అర్జున్ రెడ్డి సినిమాతో తెరంగ్రేటం చేసి మొదటి సినిమాతోనే మంచినటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు తమిళ హీరో జీవాతో జత కట్టనుంది. ఈ విషయాన్ని ఆ సినిమా బృందం ప్ర‌క‌టించింది. డాన్‌ సాండీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా 2018 జనవరిలో ప్రారంభమ‌వ‌నుంది. క్రైమ్‌ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. విజయేంద్రవర్మ నిర్మాణంలో ఈ సినిమా వ‌స్తోంది.

తెలుగులో విజయం సాధించిన ‘100% లవ్‌’ సినిమా తమిళ రీమేక్‌లో జీవీ ప్రకాశ్‌కుమార్‌తో కూడా శాలినీ కలిసి నటిస్తోంది. స్క్రిప్ట్‌లో ఉన్న థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఆధారంగా హీరో జీవాను ఫ్రెష్‌ అండ్‌ యంగ్‌ టాలెంట్‌ ఉన్న అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలని షాలినీ పాండేని ఎంపిక చేశారంట‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -