Sunday, June 2, 2024
- Advertisement -

రూ.200 కోట్ల వైపు స‌ల్మాన్‌ఖాన్‌

- Advertisement -

12వ సారి వంద కోట్ల క్ల‌బ్‌లోకి

భార‌త సినీ ప‌రిశ్ర‌మలో అతి పెద్ద‌ది బాలీవుడ్. ఈ బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ది ఓ ప్ర‌త్యేక స్థానం. ఆయ‌న న‌టించిన ప్ర‌తి సినిమా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. సినిమా సినిమాకు వ‌సూళ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా టైగ‌ర్ జిందా హై సినిమా విడుద‌ల‌య్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది.

క్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ కలెక్షన్ల వేగం ఏ మాత్రం తగ్గకపోవడం సల్మాన్ స్టామినాకు సాక్ష్యం అంటున్నారు ట్రేడ్ పండితులు. టైగర్ జిందా హై చిత్రం బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం తిరుగులేని వసూళ్లను సాధించింది. దేశీయ మార్కెట్‌లో శుక్రవారం 34.10 కోట్లు, శనివారం 35.50 కోట్లు, ఆదివారం 45.53 కోట్లు, సోమవారం 36.54 కోట్లతో మొత్తం 151.47 కోట్లు వసూళ్లను సాధించింది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

అమెరికా, కెనడా మార్కెట్‌లో డాల‌ర్ల ల‌క్ష‌ల్లో వ‌స్తున్నాయి. 2017 ఏడాది ముగింపున‌కు మంచి వ‌సూళ్లతో మంచి ముగింపు ప‌లుకుతున్నారు. ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం త్వ‌ర‌లోనే ఉంది. రెండోవారం ముగింపులోగా సల్మాన్ ఈ సినిమా ఆ క్ల‌బ్‌లో చేరే అవ‌కాశం ఉంది.

12వ సారి 100 కోట్ల క్లబ్‌లో
సల్మాన్‌ఖాన్ 100 కోట్ల క్ల‌బ్‌లో మరో రికార్డు సృష్టించాడు. ఆయన నటించిన చిత్రాల్లో ఇప్పటివరకు 12 సినిమాలు రూ.వంద కోట్ల మార్కును తాకాయి. బాలీవుడ్‌లో గానీ, ఇతర భాషల్లో గానీ సల్మాన్‌దే అత్యుత్తమ రికార్డు. దేశీ మార్కెట్‌లో భజరంగీ భాయ్‌జాన్ రూ.320.34 కోట్లు, సుల్తాన్ 302 కోట్లు వసూలు చేశాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -