Sunday, May 19, 2024
- Advertisement -

బ్రేకింగ్ః అర్జున్ రెడ్డి సీక్వెల్ ఆన్ కార్డ్స్…. 40వ వడిలో అర్జున్‌రెడ్డి కథతో

- Advertisement -

అర్జున్‌రెడ్డి సినిమాలో ప్రేక్షకులకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఇంకేంటి అర్జున్ రెడ్డినే. అర్జున్‌రెడ్డి బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నింటినీ పిచ్చిపిచ్చిగా ఇష్టపడ్డారు సినిమా లవర్స్. అందుకే మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేశారు. చాలా మంది యువ ప్రేక్షకులు అర్జున్‌రెడ్డిలా ఫీలయిపోయారు. కొన్ని రోజుల పాటు అర్జున్‌రెడ్డి పూనినట్టుగానే అర్జున్‌రెడ్డిలా ప్రవర్తించారు. మరి అలాంటి అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌కి సీక్వెల్ అంటే ఎలా ఉంటుంది?

పాతికేళ్ళ అర్జున్‌రెడ్డిని చూసేశాం. అదే నలభై ఏళ్ళ అర్జున్ రెడ్డి ఎలా ఉంటాడు? ప్రేమ విషయంలో, సొసైటీతో కనెక్ట్ అయ్యే విషయంలో అర్జున్‌రెడ్డి ఎలా బిహేవ్ చేస్తాడు? అసలు అర్జున్‌రెడ్డిలాంటి వాడు నలభై ఏళ్ళ పెద్ద వయసులో బంధాలు, బంధువుల మధ్య మనగలడా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు? ఆ ప్రాబ్లమ్స్ తర్వాత అర్జున్‌రెడ్డినే మారిపోయి సొసైటీలో అందరిలా బ్రతికేస్తాడా? లేకపోతే తనే ఓ బెంచ్ మార్క్ సెట్ చేస్తాడా?

ఇదే కథతో అర్జున్ రెడ్డి సీక్వెల్ త్వరలో రాబోతోంది. సందీప్‌రెడ్డి వంగా ప్రస్తుతం రామ్‌చరణ్‌, మహేష్‌బాబులలో ఎవరో ఒకరితో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ సినిమా అయిపోగానే ఈ అర్జున్‌రెడ్డి సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ సినిమా హీరో విజయ్‌దేవరకొండ కూడా చెప్పుకొచ్చాడు. నిజాయితీగా ఉండే యారగెంట్ యాటిట్యూడ్ ఉన్న ఫార్టీ ఇయర్స్ అర్జున్‌రెడ్డిని త్వరలోనే వెండితెరపై చూడబోతున్నామన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -