Wednesday, May 22, 2024
- Advertisement -

బిజెపి సీనియర్ నాయకుడు……. వైకాపాలో చేరడం ఖాయమా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. నాయకులందరూ కూడా 2019లో గెలవబోయే పార్టీ ఏది అని అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కువమందికి వైకాపానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు నేతలతో పాటు టిడిపిలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు, వాళ్ళ వారసులు కూడా విజయసాయితో టచ్‌లోెకి వెళ్తూ జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా బిజెపి సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా వైకాపాలో చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ నాయకుడు అయిన కన్నా లక్ష్మీనారాయణ బిజెపిలో సరైన గుర్తింపులేదని అసహనంతో ఉన్నాడు. అన్నింటికీ మించి 2019 ఎన్నికల్లో బిజెపికి ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేదని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. కన్నా ప్లానింగ్‌ని పసిగట్టిన టిడిపి నాయకులు ఎలా అయినా కన్నాను టిడిపిలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేశారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ మాత్రం 2019లో జగనే అధికారంలోకి వస్తాడన్న అంచనాలు తనకు ఉన్నాయని టిడిపి నాయకులతో చెప్పాడు. అంతకంటే కూడా చంద్రబాబు మాటలను అస్సలు నమ్మలేనని, జగన్ అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని ….అందుకే వైకాపాలో చేరుతున్నానని స్పష్టం చేశాడు. కన్నా అనుచరులు కూడా వైకాపాలో చేరడమే కరెక్ట్ అని చెప్పారట. అతి త్వరలోనే కన్నా లక్ష్మీనారాయణ జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -