Monday, May 5, 2025
- Advertisement -

అర్జున్‌రెడ్డికి బంప‌రాఫ‌ర్‌.. జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ఓ త‌మిళ్ సినిమా

- Advertisement -

‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాల‌తో స్టార్‌గా విజయ్ దేవరకొండ మారిపోయాడు. అర్జున్‌రెడ్డి సినిమాతో మొత్తం సినీ ప‌రిశ్ర‌మ అంతా విజ‌య్‌పైనే ఫోక‌స్ పెట్టారు. చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ సినిమాలు చేస్తున్న విజ‌య్‌ను అర్జున్‌రెడ్డి సినిమా ఓ స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు అత‌డు ఏం సినిమా తీస్తాడ‌ని.. ఎలాంటి సినిమాతో వస్తాడ‌ని ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వివాదాల‌తో పాటు సంచ‌న విజ‌యం అందుకుంది. ఈ ‘అర్జున్ రెడ్డి’తో కేవలం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాదు..ద‌క్షిణ భార‌త‌మంతటా పాపులర్ అయ్యాడు విజయ్. ముఖ్యంగా తమిళనాడులో మంచి పేరు క్రేజ్ వ‌చ్చేసింది. అయితే ఈ త‌మిళ్ సినిమా తెలుగులో రీమేక్ కూడా చేసి విడుద‌ల చేయ‌డం ఖాయ‌మే.

ఇప్పుడు అత‌డికి త‌మిళంలో ఓ బంప‌రాఫ‌ర్ వ‌చ్చింది. తమిళంలో పెద్ద సినిమా అవకాశం పట్టేశాడు. హీరో సూర్య కజిన్, స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా తమిళంలో విజ‌య్‌తో నేరుగా ఓ సినిమాను నిర్మిస్తున్నాడ‌ట‌. ‘అరుమా నంబి’ అనే సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. త‌ర్వాత విక్రమ్ హీరోగా ‘ఇంకొక్కడు’ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు ఆనంద్ శంకర్ విజ‌య్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తీయ‌నున్నార‌ట‌. ఓ తెలుగు యువ కథానాయకుడితో ఓ పెద్ద తమిళ నిర్మాత తమిళంలో సినిమా చేయడం విశేషం. అయితే విజ‌య్ తెలుగులో ఇప్పటికే దాదాపు ఆరేడు సినిమాల‌కు అంగీక‌రించాడు. ఈ సినిమాల మ‌ధ్య‌లో తమిళ సినిమాకు ఎప్పుడు టైం కేటాయిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -