Thursday, April 25, 2024
- Advertisement -

పొట్టి నిక్కర్ లో.. హల్ చల్ చేస్తున్న అర్జున్ రెడ్డి బామ!

- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఎంతో మంది రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిపోయారు.ఈ సినిమాలో నటించిన హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతోమంది కుర్రకారుల హృదయాలను కొల్లగొట్టిన షాలినీ పాండే అందాలకు, నటనకు అందరూ ఫిదా అయ్యారు.

అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలిసి రాలేదు. తెలుగులో ఏ మాత్రం అవకాశాలు లేకపోవడంతో ఈమె చూపు తమిళం వైపు మళ్ళింది. ఈ క్రమంలోనే 100% లవ్ సినిమా రీమేక్ 100% కాదల్ పేరుతో తెరకెక్కిన సినిమాలో షాలినీ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ద్వారా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదు.

Also read:బిగ్ బాస్ లోకి చిన్నారి పెళ్ళికూతురు… షో ఎప్పుడు ప్రారంభమంటే?

సినిమాలలో అవకాశాలు లేకున్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ ఓ పొట్టి నిక్కరు ధరించి.. వింత ఎక్స్ప్రెషన్స్ తో ఉన్నటువంటి ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో ఎలాంటి ఆఫర్స్ లేకపోయినప్పటికీ జయేష్ భాయ్ జోర్దార్ అనే సినిమాతో పలకరించేందుకు రెడీగా ఉన్నారు.

Also read:ఆ వ్యాపార వేత్తను రహస్యంగా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -