Wednesday, May 15, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి హీరోయిన్ కి.. ఏ హీరో ఇష్టమంటే..?

- Advertisement -

అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే కి ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆమెకు ఇష్టమైన హీరో ఎవరన్నది బయటపెట్టేసింది. ఈ మూవీ హీరో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని.. తెలిపింది. ఈ మూవీ హిట్ తర్వాత షాలినికి పలు షాప్ ఓపెనింగ్స్ కు కూడా ఆహ్వానాలు అందుతున్నాయి.

రీసెంట్ గా షాలిని సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమాం కోసం నెల్లూరుకు వెళ్లింది. అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానుల హాజరయ్యారు. దీంతో ఆమె కాస్త అస్వస్థతకి లోనయ్యారు. అయితే వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. అయితే.. ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న క్రమంలో తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ లో మాట్లాడింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. తనకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ.. అందుకే అతనితో నటించినప్పుడు చాలా స్వేచ్ఛగా ఉంటుందని తెలిపింది.

ఇకపోతే.. ఈ భామ ‘మహానటి’ మూవీలో.. నటిస్తున్నానని.. అయితే అందులో తాను నటించబోయే పాత్ర గురించి ఇప్పుడే చెప్పనని ఇంకో అభిమాని ప్రశ్నకు జవాబు ఇచ్చింది. అలానే ‘100% లవ్’ తమిళ రీమేక్ లో కూడా నటిస్తున్నని.. మరో ప్రశ్నకు జవాబుగా షాలిని పాండే చెప్పింది. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన షాలినికి ఇప్పుడు నిర్మాతలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -