సినిమా ప్రపంచంలోకి.. ఎందరో హీరోయిన్స్.. ఏదో సాధించాలనే తపనతో పరిశ్రమలోకి అడుగుపెడ్తారు. సినీ పరిశ్రమలో ఏం జరిగిన ఓ సంచలనమే. అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ మృతి.. భావన కిడ్నాప్ కేసు.. ఇలా ఎన్నో విషయాలు సెన్సేషన్ అయ్యాయి. ఇప్పుడు అలాంటే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హీరోయిన్ మీరా జాస్మిన్.. ఈమె ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగింది.
తెలుగులోనే కాకుండా తమిళం.. మళయాళ సినిమాలు కూడా చేసి.. మంచి సక్సెస్ అందుకొని.. మంచి నటిగా పేరు సంపాధించుకుంది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు ఒకరిని పెళ్లి చేసుకుంది..! అదే తనని ప్రస్తుతం కష్టాల్లోకి నెట్టింది అని “మీరా” స్నేహితులు అంటున్నారు..! ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. పూర్తి వివరాల్లోకి వేళ్తే.. సినిమా అవకాశాలు వస్తున్న క్రమంలో.. అవకాశాలను పక్కన పెట్టి.. “ప్రముఖ సంగీత విద్వాంసుడు” “మంటొని రాజేష్” ను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. కానీ ఆ తర్వాత అతనికి బ్రేక్ అప్ చెప్పేసి.. దుబాయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ “అనిల్ జాన్ టైటస్” ను పెళ్లి చేసుకుంది. అతనికి ఇది రెండో పెళ్లి. మీరా జాస్మీను సినిమాలు చెయద్దు అని అనిల్ చెప్పేవాడట. కానీ మీరా మాత్రం సినిమాలు వదులుకునే పరిస్థితి లేదని భర్తకు తేగేసి చెప్పిందట.
ఈ నెపథ్యంలో.. ఇద్దరికి బాగా గొడవలు జరిగాయట. దీంతో “అనిల్” మొదటి భార్య వైపు మొగ్గు చూపడు. ప్రస్తుతం మీరా ఇండియాకు వచ్చేసి.. ఇక్కడే ఉంటుంది. తల్లి తండ్రులు కూడా మీరా ను వ్యతిరేకించారట. దాంతో “మీరా” ప్రేమించిన వాడిని, పెళ్లి చేసుకున్న వాడినే కాదు తల్లి తండ్రులను కూడా దూరం చేసుకుంది. ప్రస్తుతం మళ్లీ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఒక్కటి రెండు తప్పిస్తే.. పెద్దగా అవకాశాలు రావడం లేదు. మరీ మీరాకు పిలిచి పెద్ద అవకాశం ఎవరు ఇస్తారో చూడాలి.
