టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మాస్, క్లాస్ ఆడియన్స్ లో యమ క్రేజ్ ఉన్న కథానాయకుడు. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అదరగొడుతూ పలు క్రేజీ భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ తన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ప్రభాస్ అనగానే అందరికీ డార్లింగ్ అనే పేరే గుర్తొస్తుంది. ప్రభాస్ అందరితో చాలా ఆప్యాయతగా మాట్లాడుతారని, ప్రభాస్‌తో నటించడం ఎవరికై చాలా కంఫర్ట్‌గా ఉంటుందని స్టార్ హీరో అనే విషయాన్నే ఆయన పట్టించుకోడని అతని వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన చాలామంది చెప్పే మాటిదే.
తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకున్నారు.’బాహుబలిలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. అందులో కాలకేయుడితో యుద్ధానికి వెళ్లేముందు దున్నపోతుని బలిచ్చే సన్నివేశంలో డైలాగ్.. “ఆహుతి ఇచ్చి యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది .. పెనుముప్పు తప్పదు యువరాజా” అనేది నా డైలాగ్. అయితే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్పాను. దీంతో ప్రభాస్ నా దగ్గరికి వచ్చి “డార్లింగ్ ఏమనుకోకు..డైలాగ్ కొంచెం మెల్లిగా చెప్పవా..నా డైలాగ్ మరిచిపోతున్నాను” అని అన్నారు. ఇది నా జీవితంలోనే మర్చిపోలేని ఘటన. నిజంగానే ఆయన డార్లింగ్’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also read:అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ‘రాధేశ్యామ్’ ‘ఆదిపురుష్’, చిత్రాలతో బిజీగా ఉన్నారు.‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ అంచనాలు పెరిగిపోయాయి.
Also read:అతని ఫోటో ముందు పెట్టుకుని అర్ధరాత్రి కూతురుతో కలిసి రచ్చ చేసిన సురేఖవాణి!