- Advertisement -

ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు

- Advertisement -

ప్రముఖ గాయని ఆశా భోస్లేకు శనివారం ఉదయం 92 ఏళ్ల ఆశా భోస్లేకు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ప్రతిత్ సమధాని వెల్లడించిన ప్రకారం, ప్రస్తుతం ఆమెకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఈ విషయాన్ని ఆశా భోస్లే మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అతిగా అలసట (ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాషన్) మరియు ఛెస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా అమ్మమ్మను ఆసుపత్రిలో చేర్పించాం. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. దయచేసి మా కుటుంబ గోప్యతను గౌరవించండి అని పేర్కొన్నారు. త్వరలోనే మంచి వార్త చెబుతామని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు త్వరలోనే అధికారిక మెడికల్ బులెటిన్ విడుదల చేయనున్నాయి. ఏప్రిల్ 12, 2026న తాజా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

సంగీత ప్రస్థానంలో ఆశా భోస్లే 1948లో విడుదలైన చునారియా చిత్రంలోని “సావన్ ఆయా” పాటతో హిందీ ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి వేలాది పాటలతో కోట్లాది అభిమానులను సంపాదించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -