- Advertisement -

ఎట్టకేలకు సీఎస్‌కే గెలిచింది

- Advertisement -

చెన్నై సూపర్ కింగ్స్ IPL 2026లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. చెన్నైలోని చేపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేజ్ చేయడానికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సీఎస్‌కే వరుస పరాజయాలకు చెక్ పెట్టి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

ఈ సీజన్‌లో తొలి సెంచరీ బాదాడు సంజూ శాంసన్. 56 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేసి జట్టును బలమైన స్థితిలో నిలిపాడు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

212 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ వేగంగా ప్రారంభించింది. కానీ సీఎస్‌కే బౌలర్లు మ్యాచ్‌ను మళ్లీ తమ వైపుకు తిప్పారు. స్టబ్స్ 38 బంతుల్లో 60 పరుగులు చేసిన ఢిల్లీ ఓటమి తప్పలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -