Saturday, May 18, 2024
- Advertisement -

వెరైటీ…యువ న‌టుడిపై హీరోయిన్ అత్యాచారం

- Advertisement -

ప్ర‌స్తుతం స‌మాజంలో మ‌హిళ‌ల‌పై అత్యాచారం సంఘ‌ట‌న‌ల‌ను నిత్యం చూస్తునే ఉన్నాం.కాని ఎక్క‌డో ఓ చోట ఇలాంటి వింత సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. అవును మీరు వింటున్న‌ది నిజ‌మే…ఓ న‌టుడుపై హీరోయిన్ అత్యాచారానికి పాల్పడింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే….హాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఏషియా అర్జెంటో యువనటుడు, సంగీత దర్శకుడు అయిన జిమ్మీ బెనెట్ పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిమ్మీ 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అర్జెంటో అతడిపై అత్యాచారం చేసినట్లు వార్తలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఓ షూటింగ్‌లో ఇద్దరూ కలిసి పని చేయడంతో ఒకే హోటల్‌లో ఉండాల్సి వ‌చ్చింద‌ట‌. జిమ్మీ ఆమె హోటల్ గదికి వెళ్లగా అతడిపై అఘాయిత్యానికి పాల్పడిందట. ఈ విషయం బయటపడకుండా ఉండడానికి అతడికి రెండున్నర కోట్లను వాయిదా పద్ధతుల్లో చెల్లించినట్లు డాక్యుమెంట్లు బయటపడ్డాయి.అయితే దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -