Monday, May 6, 2024
- Advertisement -

ఇంక సినిమాలు చెయ్యను

- Advertisement -

కేరళ కుట్టి ఆసిన్ గుర్తుంది కదా…గజినీ, లక్ష్మీ నరసింహా, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తమిళ్ లోనూ టాప్ హీరోయిన్ అయ్యింది, కానీ బాలీవుడ్ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్న అమ్మడు సౌత్ కి గుడ్ బాయ్ చెప్పేసి బాలీవుడ్ లో జెండా పాతడానికి సిద్ధం అయింది.

తొలినాళ్ళలో వరుస 100 కోట్ల సినిమాలతో హోరెత్తించిన అమ్మడు తరువాత స్లో అయిపోయి కెరీర్ డౌన్ అయిపొయింది. ఇలాంటి సమయంలో లీడింగ్ మొబైల్ కంపనీ మైక్రోమాక్స్ ఓనర్ తో ప్రేమలో పడటం అది వివాహానికి దారి తీయడంతో ఈ మధ్యనే తనని పెళ్లి చేసుకుని ఓ ఇంటింది అయ్యింది కేరళ కుట్టి ఆసిన్.

కాగా తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని కొందరు ఆమెని అడగ్గా ఇక సినిమాల్లో నటించను…మా ఆయనతో కలిసి కంపినీ వ్యవహారాలు చూసుకుంటా ఎందుకంటే నేను MBA పూర్తి చేశాను అని చెబుతుందట. దాంతో తన గ్లామర్ తో ఆకట్టుకున్న ఆసిన్ ని ఇక మీదట ఆమె ఫ్యాన్స్ మిస్ అవ్వక తప్పదు అన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -