Sunday, April 28, 2024
- Advertisement -

హరీష్ – పవన్ సినిమా ఓకే అయినట్టే

- Advertisement -

ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు హరీష్ శంకర్…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన తరువాత మళ్ళీ అలాంటి హిట్ ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతున్న హరీష్ ని గబ్బర్ సింగ్ సినిమా సీక్వెల్ నుండి పవన్ తప్పించిన కారణాలు తెలియకున్నా దానివల్ల ఆ సినిమా కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోవడంతో అది బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది.

కాగా ఈ మధ్యలో పవన్ పిలిచి మరీ కథ చెప్పమని అడిగాడు హరీష్ శంకర్ ని. కాగా పవన్ కోసం గబ్బర్ సింగ్ తరువాత రాసుకున్న ఓ సూపర్ కథని పవన్ కి ఈ మధ్యనే వినిపించాడు హరీష్. కాగా కథ విన్నవెంటనే నచ్చేసిందట పవన్ కి. కానీ ప్రస్తుతం ఫారన్ కి వెళ్ళగా అక్కడ నుండి ఈ మధ్యనే హరీష్ కి ఫోన్ చేశాడట.

మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పాడని ప్రస్తుతం ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాకు ఒకప్పటి ఖుషి సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మించబోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఈ నిర్మాతతోనే పవన్ లాస్ట్ ఇయర్ కోలివుడ్ బ్లాక్ బస్టర్ వేదళం సినిమా చేయాల్సి ఉంది. మరి ఆ సినిమానేనా ఇది లేక కొత్త సినిమానా అనేది తేలాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -