Friday, March 29, 2024
- Advertisement -

విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అయిన అవెంజర్స్

- Advertisement -

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం గొప్ప కాదు, ఈ సినిమా విడుద‌ల అయ్యే వ‌ర‌కు లీక్ అవ్వ‌కుండా చూడ‌టం గొప్ప‌. ఈ రోజుల్లో సినిమాలు విడుద‌లకు ముందే ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అవుతున్నాయి.తాజాగా మ‌రో సినిమా విడుద‌ల‌కు ముందే లీక్ కావ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. హాలీవుడ్‌లో అవెంజర్స్ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ఉంది. అవెంజర్స్ విడుద‌ల అవుతుంటే చాలు టికెట్ల కోసం థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ పేరిట వ‌స్తున్న కొత్త సిరీస్ రేపు(26)న విడుద‌ల కానుంది. దేశంలో మొత్తం 2,500 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.ఒక హాలీవుడ్ సినిమా ఈ రేంజ్ లో ఇండియాలో విడుదల కావడం ఇదే తొలిసారి.

అయితే ఈ సినిమా విడుద‌ల కాకుండానే సినిమా మొత్తం లీక్ చేశారు తమిళరాకర్స్. సినిమా మొత్తం లీక్ కావడంతో నిర్మాతలు ఆందోళనకు చెందుతున్నారు. ఇలాంటి సినిమాలు ఆన్ లైన్ లో లీక్ అయితే ఆ ప్రభావం బాక్సాఫీస్ పై పడుతుందని భయపడుతున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.ఇలాంటి సినిమాలు పైరసీలో చూడ‌టానికి ఎవ‌రు ఇష్ట‌ప‌డ‌ర‌ని , థియేటర్‌కి వెళ్లే ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. బుక్‌మైషో ద్వారానే సినిమాకు ఇండియాలో మొద‌టి రోజున నలభై కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మ‌రి సినిమా విడుద‌ల త‌రువాత ఇంకెన్ని సంచ‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -