Tuesday, May 14, 2024
- Advertisement -

ఫ్రెండ్ పెళ్లిలో ర‌చ్చ ర‌చ్చ చేసిన స‌మంత‌

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత అక్కినేని ఇంటి కోడ‌లు అయిన త‌రువాత త‌న క్రేజ్‌ను మ‌రింత పెంచుకుంది. అక్కినేని నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది స‌మంత‌. పెళ్లి తరువాత ఆమె న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. ఇటీవ‌లే భ‌ర్త‌తో క‌లిసి మజిలీ సినిమాలో న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది. స‌మంత‌ షూటింగ్‌ల‌కు గ్యాప్ దొరికితే చాలా తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. స‌మంత‌లో కాస్తా అల్ల‌రి ఎక్కువ‌నే చెప్పాలి. త‌న పెళ్లిలో తానే తెగ హంగామా చేసింది. ఇటీవ‌లే జ‌రిగిన వెంక‌టేశ్ పెద్ద కూతురి వివాహాంలో కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది స‌మంత‌.

తాజాగా ఆమె త‌న క్లోజ్ ఫ్రెండ్ వివాహానికి హాజ‌రైంది. తన స్నేహితురాలి పెళ్లి వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. క్రైస్తవ సంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుక చిత్రాలను అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ చిత్రాల్లో వధువు తెలుపు రంగు దుస్తుల్లో మెరుస్తుండగా, సమంత సహా ఆమె స్నేహితులంతా నీలి రంగు వస్త్రాల్లో ఉన్నారు. స్నేహితురాలి పెళ్లిలో స‌మంత ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో పాటు త‌మిళ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది స‌మంత‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -