Saturday, May 4, 2024
- Advertisement -

‘బాహుబ‌లి-2’ సెన్సార్ పూర్తి.. విడుద‌ల‌ ఎక్క‌డంటే?

- Advertisement -

మ‌న‌దేశంలో విడుద‌లైన సినిమాల‌ను ప్ర‌పంచ దేశాల్లో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇక్క‌డ ఎంత మంది చూసినా అంత‌గా ఆదాయం రాదు. అదే విదేశాల్లో విడుద‌లై ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందితే వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తుంది. ఈ సూత్రాన్ని ప‌ట్టిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న బాహుబ‌లి సినిమాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేశాడు.

ఈ రెండు సినిమాలు భార‌త‌దేశ‌మంతా విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఆ త‌ర్వాత విదేశాల్లోనూ విడుద‌ల‌య్యి మంచి లాభాలు పొందింది. ఈ సినిమాల్లో బాహుబ‌లి మొద‌టి సినిమాను చైనాలో విడుద‌ల చేసి మంచి దాదాపు 123 మిలియన్ల డాలర్ల క‌లెక్ష‌న్ అందుకుంది. ఆ త‌ర్వాత ‘బాహుబ‌లి-2’ సినిమా విడుద‌ల చేయాల‌ని చూశారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేదు. చివ‌ర‌కు ఎట్ట‌కేల‌కు ఈనెల‌నో.. వ‌చ్చే నెల‌నో ‘బాహుబ‌లి-2’ సినిమా విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. ఈ ఐదేళ్లలో ఇండియన్ సినిమాలు హాలీవుడ్ స్థాయికి చేరడం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఒక సినిమా తరువాత మరొకటి విదేశీయులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా దంగల్ సినిమా చైనా లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసినిమా అక్కడి రికార్డులతో ఇండియాలోనే కలెక్షన్స్ పరంగా అతిపెద్ద సినిమాగా నిలిచింది. ప్ర‌స్తుతం చైనాలో సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీంతో చైనాలో బాహుబలి – ది కన్‌క్లూజన్ సినిమా విడుద‌ల చేయ‌డానికి ఆర్కా మీడియా ప్లాన్ చేస్తోంది. ఎమోషన్‌ను ఎక్కువగా ఇష్టపడే చైనా సినీ జనాలకు ‘బాహుబ‌లి-2’ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశాభావంగా సినిమా నిర్మాత‌లు ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -