Sunday, May 4, 2025
- Advertisement -

భ‌ళ్లాల దేవ చేతిలో నాలుగు సినిమాలు

- Advertisement -

బాహుబ‌లి 1, 2 సినిమాల‌తో భ‌ళ్లాల‌దేవుడిగా ద‌గ్గుబాటి రానా త‌న‌లోని న‌టుడిని మేల్కొలిపి విజృంభించాడు. ఆ సినిమా త‌ర్వాత నేనే రాజు.. నేనే మంత్రి, ఘాజీ సినిమాల‌తో వ‌చ్చి మంచి విజ‌యాలు అందుకున్నాడు. ఈ నేప‌థ్యంలో రానాకు వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో, బుల్లి తెర‌లో ఎప్పుడూ బిజీగా ఉంటున్న రానా చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి.

వచ్చే యేడాదిలో దాదాపు ఐదు సినిమాలతో వ‌చ్చే అవ‌కాశం ఉంది. ‘1947’, ‘రాజమార్తాండ’.. ఇలా చారిత్రక‌ ప్రధానమైన సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య కేరళకు వెళ్లిన స‌మ‌యంలో రానా అక్కడ మలయాళ సినిమాలు చూశాడు. చాలా సింపుల్‌గా, జీవితానికి దగ్గరగా ఉన్నాయి. ఆ తరహా సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఏనుగుల నేపథ్యంలో సాగే ఓ సినిమా చేస్తున్నాడు. మానవుడికి, ప్రకృతికీ మధ్య సాగే ఆసక్తికరమైన కథకు రానా అంగీక‌రించాడు. పర్యావరణానికి ముప్పు పొంచి వున్న సమయంలో కచ్చితంగా చెప్పాల్సిన కథ ఇది అని భావిస్తున్నాడు. వీటి తర్వాత గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘హిరణ్యకశిపుడు’ కూడా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -