Tuesday, May 6, 2025
- Advertisement -

భజరంగీ భాయిజాన్‌ ముందు నిలబడలేకపోయిన బాహుబలి

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఇపుడు ఎక్కడ చూసినా రికార్డుల మోతే వినిపిస్తోంది. ఒక సినిమా రికార్డులను …. ఇంకో సినిమా వచ్చి కొట్టేస్తోంది. అది కూడా వెరీ షార్ట్ పిరియడ్‌లోనే.

దీంతో గత కొన్ని రోజుల నుంచి రికార్డులు కంటిన్యూగా పగులుతూనే ఉన్నాయి.

సౌత్ లో అని కాదు. బిటౌన్లో సైతం కొత్త రికార్డులు పుట్టుకొస్తున్నాయి. భజరంగి బాయిజాన్ ఏకంగా 570కోట్లు సాధించి ఇండియన్ సెకండ్ హయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది.

మన  బాహుబలి ఇండియన్ హయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్స్ లో మూడో స్థానం సంపాదించుకుంది.ధూమ్ 3 ఓవరాల్ గా 542 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే… ఆ రికార్డ్ ని బాహుబలి బ్రేక్ చేసి 545 కోట్ల గ్రాస్ తో ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఉన్నత స్థానాన్ని సంపాదించింది.

రీసెంట్ గా వచ్చిన శ్రీమంతుడు కూడా అత్తారింటికి దారేది చిత్రం తాలూకు రికార్డులను తుడిచిపెట్టేసినట్లు తెలుస్తోంది. నైజాం లో అత్తారింటికి దారేది ఫుల్ రన్లో సాధించిన మొత్తాన్ని …శ్రీమంతుడు  కేవలం 4 రోజుల్లో నే అందిపుచ్చుకుంది. దీంతో బాహుబలి తో పాటు శ్రీమంతుడు కూడా రికార్డులను పరంపరను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఒక సినిమా రికార్డుల క్రియేట్ చేయడమనేది… బాక్సాఫీస్ దగ్గరనే కాదు …శాటిలైట్ విషయంలోను కనిపిస్తుంది. త్రిపుర,భలే మంచి రోజు ,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు దీనికి మంచి ఉదాహరణలు.

చిన్న సినిమాలే అయినా శాటిలైట్ రంగంలో కొత్త రికార్డులు నమోదు చేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -