Tuesday, May 21, 2024
- Advertisement -

బాహుబలి రివ్యూ

- Advertisement -

న‌టీన‌టులు: ప్రభాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్‌, సుదీప్ త‌దిత‌రులు

బ్యాన‌ర్‌: ఆర్కా మీడియా

స‌మ‌ర్ప‌ణ‌: కె.రాఘ‌వేంద్ర‌రావు

సంగీతం: ఎంఎం.కీర‌వాణి

సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌కె.సెంథిల్ కుమార్‌

క‌థ‌: విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌

నిర్మాత‌లు: దేవినేని ప్ర‌సాద్‌, శోభు యార్ల‌గ‌డ్డ‌

ద‌ర్శ‌క‌త్వం: ఎస్ఎస్‌.రాజ‌మౌళి

రేటింగ్ 3.5/5

మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబళి చిత్రం భారీ అంచానాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రీతీలోనే ప్రేక్షకుల అంచనాలు అందుకుని చరిత్ర సృష్టించింది. కానీ ఇది ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అంచనాలు తగ్గించుకొని చూసే వారికి మాత్రం వండర్‌గా నిలుస్తుంది. 

ఆర్ట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ మూవీలో ఎక్కువగా చెప్పుకోదగ్గ విషయాలు. అబ్బురపరిచే విజువల్స్, ఇంట్రడక్షన్ సీన్స్ అన్ని సెంటర్స్ వారినీ ఆకట్టుకుంటుంది.

అయితే బలహీనమైన్ కథనం అందరికి తెలియని నిరాశను గురిచేస్తోంది.  తన కళను ఒక మూవీ ద్వారా ఇంత అద్బుతంగా చూపించడం ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించుకున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు SS రాజమౌళిని సూపర్ సక్సెస్‌ రాజమౌళిగా పిలుస్తారనడంలో అతిశయోక్తి లేదు. అలాగని ఈ మూవీని ఏ కోణంలోనూ అవతార్‌తో పోల్చలేం. 

రాజమౌళి కథ మరియు స్క్రీన్‌ప్లే పై మరింత శ్రద్ద పెట్టి ఉంటే ఈ సినిమా అనుకున్న విదంగానే ప్రపంచ ఖ్యాతి ఘడించేది. క్లైమాక్స్ విషయంలో ఆడియన్స్ ని అనుకున్న స్థాయిలో సంతృప్తి పరచలేకపోయాడు

ప్రముఖ వెబ్‌సైట్ IMDB(Internet Movie Database) ఈ చిత్రానికి గాను 9.5/10  రేటింగ్ ఇచ్చింది. అలాగే మరిన్ని బాలివుడ్ సినీ వెబ్‌సైట్స్ 4/5 రేటింగ్ ఇచ్చాయి. 

అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉండడంతో ప్రభాస్ అభిమానులు, అలాగే సినీ ప్రియులు చాలా సంతోషంగా ఉన్నారు. కీరవాణి అందించిన పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌లో చాలా సీన్స్ ఎడిట్ చేయవచ్చు. కొన్ని సీన్స్  డ్రాగ్ చేసిన ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. 

హైలైట్స్ :

పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కొండ చర్యల్లో ఊడలు పట్టుకొని వ్రేలాడుతూ ఉన్న సీన్లు చాలా ఎగ్జైట్ మెంట్ గా అనిపిస్తాయి.

ప్రభాస్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. చాల హ్యండ్సమ్ గా కనిపిస్తాడు. 

బల్లాల దేవ (రానా) ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉంది.. కండలు తీరిగిన యోధుడులా.. ఎద్దుతో భీకరంగా ఫైటింగ్ సీన్ చాలా బాగుంటుంది.

తమన్నా అందం అందరిని ఆకర్షించి నిజంగా దేవకన్య అనిపించేలా ఉంటుంది. 

డైలాగ్ : పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్పా బల్లాల దేవ కు చితి పేరుస్తున్నా..

సినిమాలో కీరవాణి అందించిన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కు  అందరూ ముగ్దులైపోతారు.  

ఫస్ట్‌ ఆఫ్ మొత్తం బాహుబలి కనిపించడు. 

తల్లి పాత్రలో అనుష్క అద్భుతంగా నటించింది.

రానా, నాజర్ ల మద్య సన్నివేశాలు సీరియస్ గా ఉంటాయి.

శివుడిని చూసి కట్టప్ప రియలైజ్ అయిన సీన్ చూస్తే థియేటర్లో అంతా తెలియని ఎమోషన్‌కు లోనవుతారు. ఈ ఒక్క సీన్ చాలు సినిమా అద్భుతం అనడానికి… అన్న రేంజ్‍లో ఈ సీన్‌ని తెరకెక్కించారు. 

ఎస్.ఎస్. రాజమౌళి వ్యాపారస్తుడిగా సినిమాలో కనిపిస్తాడు చిన్న డైలాగ్ ‘డబ్బుందా..!

కాలికేయ తమ ఆదిమవాసులతో మాట్లాడే కోయబాష విచిత్రంగా ఉంటుంది. రాజమౌళి ఈ భాషను స్పెషల్ గా తయారు చేశారు. దానికోసం లిపి కూడా తయారు చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రయోగం ఎవరూ చేయలేదు దటీజ్ రాజమౌళి..!

గ్రాఫికల్ విజువల్, పిక్చరైజేషన్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించని విధంగా చూపించారు. 

డైలాగ్స్ : వందమందిని చంపితే వీరుడు అవుతాడు.. ఒక్కడిని కాపాడితే దేవుడు అవుతాడు..  కత్తి పోటుకన్నా.. బల్లెం పోటు కన్నా..దారుణమైంది వెన్నుపోటు

 మైనస్‌లు 

ఫస్ట్ హాఫ్‌లో స్లో కథనం

బలహీనమయిన కథ

రెగ్యులర్ రివెంజ్ స్టొరీ

ప్రభాస్, తమన్నాల మద్య కెమిస్ట్రీ మరీ తక్కువ అవ్వడం

థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం

ఐటమ్ సాంగ్

 

బాహుబలి టాక్ః టికెట్ కోసం వృథాగా అంత డబ్బు పోశాం!

 

బాహుబ‌లి క‌లెక్షన్స్ ఎలా ఉండ‌వ‌చ్చు..!

Videos:  బాహుబలిపై సినీ తారల స్పందన 

{youtube}0BNlmwukBF8{/Youtube}

{youtube}RDdwVN3Se80{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -