Saturday, May 11, 2024
- Advertisement -

బాబు బంగారం ట్రైలర్

- Advertisement -

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం బాబు బంగారం అనే చిత్రం లో నటిస్తున్నారు. గోపాల గోపాల తర్వాత వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో నిన్న సాయంత్రం విడుదల అయ్యింది.

ఇక ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇదే సంవత్సరం ముప్పై ఏళ్ల సిని ప్రస్థానం పూర్తి చేసుకుంటున్న వెంకటేష్ బాబు బంగారంతో మరోసారి తన మార్క్ హిట్ కొట్టబోతున్నట్టు తెలుస్తుంది. వెంకీ సినిమాలంటే ఫ్యామిలీ మొత్తం కదిలి రావాల్సిందే. అలాంటి హృదయాన్ని కదిలించే సినిమాలను తీయడంలో కుటుంబ విలువల గురించి వెంకటేష్ మాత్రమే సినిమాలు తీయగలడనిపిస్తుంది.

ఇక బాబు బంగారం ఆడియోలో రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకుంది. బొబ్బిలి రాజా వెంకీ మార్క్ అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ మరోసారి తనలో ఉన్న స్టైలిష్ యాక్షన్ ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ఆగష్టు 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

{youtube}v=hLegi7BMW-4{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -