Sunday, April 28, 2024
- Advertisement -

క‌బాలిలో యంగ్ టైగర్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కబాలి’ తో హల్ చల్ చేస్తున్నాడు. కబాలితో ఎన్టీఆర్ హల్ చల్ చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారా? కబాలి తో పాటు ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాల మళయాళ రైట్స్‌ను మోహ‌న్‌లాల్ ద‌క్కించుకున్నాడు. కబాలి చిత్రం కేర‌ళ‌లో 306 థియేట‌ర్ల‌లో విడుదలైయింది.

అక్కడ టాప్ హీరోల సినిమాలే ఈ రేంజ్ లో రిలీజ్ కావు. ఇప్పుడు క‌బాలి ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న థియేట‌ర్ల‌లో ఇంట‌ర్వెల్ టైంలో గ్యారేజ్ మ‌ళ‌యాళ టీజ‌ర్‌ను వేస్తున్నార‌ట‌. ఈ టీజర్ కి విపరీతమైన స్పందన లభిస్తోందని సమాచారం. ఈ టీజ‌ర్ చూస్తోన్న వారు జ‌న‌తా గ్యారేజ్‌కు మ‌ళ‌యాళంలో మంచి హైప్ వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు.

గ్యారేజ్‌కు ఏ మాత్రం హిట్ టాక్ వ‌చ్చినా మల్లూవుడ్ లో ఎన్టీఆర్ మార్కెట్ కూడా బాగా పెరిగిపోతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్ పాత చిత్రాలను మలయాళంలో డబ్ చేసి విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. 

Related

  1. టెంపర్ కి మించిన రోల్ లో ఎన్టీఆర్
  2. గూగుల్‌ వల్ల ఎన్టీఆర్ సీఎం అయ్యారు!
  3. ఎన్టీఆర్ స్వార్ధం కోసమే జనత గ్యారేజ్ వాయిదా ?
  4. పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -