Saturday, May 3, 2025
- Advertisement -

బచ్చల మల్లి..లుక్ అదిరింది!

- Advertisement -

ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అల్లరి నరేష్ ప్రస్తుతం కామెడీ ట్రాక్‌ని పక్కనపెట్టి మాస్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో బచ్చలమల్లి అంటూ ప్రేక్షకుల ముందుకురానున్నారు. 1990 బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోండగా ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇవాళ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో మ్యాసీ హెయిర్, గడ్డంతో కనిపించారు నరేష్. సీరియస్ లుక్ లో రిక్షా మీద కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించగా బ్యాక్‌గ్రౌండ్‌లో బాణసంచా కాల్చడం, ఫెరోషియస్ దేవుళ్ల గెటప్‌లతో కూడిన కార్నివాల్‌ను గమనించవచ్చు.

నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -