Wednesday, April 24, 2024
- Advertisement -

‘సభకు నమస్కారం’ అంటున్న అల్లరి నరేశ్​..!

- Advertisement -

సినిమాలకు విభిన్నమైన టైటిల్స్​ పెట్టడం ట్రెండింగ్​ మారింది. అచ్చ తెలుగులో క్రియేటివ్​గా సినిమా పేర్లు పెట్టేందుకు కొందరు దర్శకులు ఇష్టపడుతున్నారు. అల్లరి నరేశ్​ 58 వ సినిమాకు ‘సభకు నమస్కారం’ అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఈ మూవీకి సతీశ్​ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. అల్లరి నరేశ్​కు చాలా కాలం తర్వాత నాంది హిట్​ అయిన విషయం తెలిసిందే.

నరేశ్​ కామెడీ జోనర్​ను వదిలిపెట్టి.. ఓ సీరియస్​ సబ్జెక్ట్​లో తొలిసారి నటించాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. ఇక నరేశ్​కు కూడా నటుడిగా మంచి పేరు వచ్చింది. గతంలో నరేశ్​ .. గమ్యం, శంభోశివశంభో వంటి చిత్రాల్లో రోటిన్​గా భిన్నంగా నటించాడు. ఆతర్వాత మళ్లీ నాంది లో నటించాడు. ఆ సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా అల్లరి నరేష్ కు హిట్ ఇచ్చింది.

ఈ సినిమాలో ఒక్క కామెడీ సీన్​ కూడా ఉండదు. సినిమా చాలా సీరియస్​గా ముందుకు సాగుతూ ఉంటుంది. అయినప్పటికీ ప్రేక్షకులు నరేశ్​ను రిసీవ్​ చేసుకున్నారు. మరి ఇప్పుడు వస్తున్న సభకు నమస్కారం ఎటువంటి సినిమా సీరియస్​ సబ్జెక్టా? లేక కామెడీ సబ్జెక్టా అన్న విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఇవాళ అల్లరి నరేష్ పుట్టినరోజు. అందుకే ఆయన నటించిన సినిమా టైటిల్ రివీల్ చేశారు.

Also Read

బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -