Sunday, April 28, 2024
- Advertisement -

మరో యాక్షన్‌ మూవీతో అల్లరోడు!

- Advertisement -

అల్లరి నరేష్‌. తొలి సినిమా టైటిల్‌ అల్లరినే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు. ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. గమ్యం, శంభో శివ శంభో లాంటి సినిమాలతో నరేషన్ నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి.

అయితే ఆ తర్వాత కెరీర్‌లో కొంత గ్యాప్ వచ్చినా సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు నరేష్. ప్రస్తుతం నరేష్ చేతిలో సభకు నమస్కారం, బచ్చలమల్లి, ఇంకో లవ్ జానర్ మూవీ ఉండగా తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇప్పటివరకు నరేష్ కెరీర్‌లో చేయని ఓ పీరియాడిక్ యాక్షన్ మూవీతో వస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రాజేష్ దండా స్వయంగా వెల్లడించారు. నరేష్‌తో ఓ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరు, నటీనటులు ఎవరు అన్న దానిపై త్వరలోనే ప్రకటన రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -