వైఎస్ఆర్ … రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఈ పేరు ఓ సంచలనం అనే చెప్పాలి. జవసత్తాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చిన ఘనత ఆయనదే. వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో తెలుగు రాష్ట్రంలో రాజకీయ శున్యత ఏర్పడింది. తాజాగా ఆయన జీవిత కథను సినిమా తెరెక్కిస్తున్నారు. యాత్ర పేరుతో తీస్తున్న ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీ పోషిస్తుండగా ,ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో మరో క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో తెలిసింది. వైఎస్ఆర్ భార్య విజయమ్మ పాత్రలో నటి ఆశ్రిత నటిస్తున్నారు. బాహుబలి సినిమాలో అనుష్క వదినగా చేసింది ఆశ్రిత.ఈ సినిమాలో ఆమెకు మంచి పేరే వచ్చింది. తాజాగా యాత్ర సినిమాలో ఆమె వైఎస్ విజయమ్మగా నటిస్తుందనే విషయం బయటికి వచ్చింది. ఆశ్రిత అయితే వైఎస్ విజయమ్మ పాత్రకు అచ్చు గుద్దినట్లు సరిపోయిందని భావిస్తున్నారు.
- Advertisement -
వైఎస్ విజయమ్మగా ఈమెనట
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -