ప్రభాస్.. హీరో కాదు టైగర్

- Advertisement -

పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ పేరు.. ఇప్పుడు దేశంలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. బాహుబలి రెండు చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసి ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు.

ప్రభాస్ పేరంటే అదో బ్రాండ్ అన్నట్లు మారిపోయింది. తాజాగా ఓ బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నెహ్రూ జ్యూయలాజికల్ పార్క్ లో ఉందీ టైగర్.

- Advertisement -

రాయల్ బెంగాల్ టైగర్ ప్రభాస్ అని సూచిస్తూ ఏర్పాటు చేసిన ఓ బోర్డు ఏర్పాటు చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారుతోంది. దీంతో ఆ రాయల్ బెంగాల్ టైగర్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

ఉచితాలు కొంప ముంచుతాయ్

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -