హైదరాబాద్‍లో ఐఫా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పలు సినీ పరిశ్రమలనుండి ప్రముఖులు హాజరవుతున్నారు. ఐతే ఈ వేడుకలో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాకి అవార్డుల పంట పడింది.
ఈ సినిమా తమిళ విభాగంలో పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా బాహుబలి ఎంపికైంది. అలాగే ఈ సినిమాలో శివగామిగా నటించిన రమ్యకృష్ణకు ఉత్తమ సహాయనటి అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ ఫిమేల్ సింగర్ గా గీతా మధురి ఎంపికైనది. ఇక అరవింద్ స్వామికి ఉత్తమ విలన్ అవార్డు దక్కించుకోగా, ధనుష్‍కి ఉత్తమ పాటల రచయితగా అవార్డు దక్కింది.
కాంచన సినిమాకి గాను ఉత్తమ కమెడియన్ గా కోవై సరళకు అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ సంగీత దర్శకుడుగా అనిరుధ్ కి అవార్డు వచ్చింది. ఇక మళయాళంలో బంఫర్ హిట్ కొట్టిన ప్రేమమ్ సినిమాకు పలు అవార్డులు వచ్చాయి. ఇక పలు స్టార్స్ తమ డాన్స్‌లతో ఈ వేడుకకు అందాన్ని తెచ్చారు.
