Friday, April 26, 2024
- Advertisement -

సంక్రాంతి బరి నుండి తప్పుకున్న బాలకృష్ణ

- Advertisement -

కే ఎస్ రవికుమార్ దర్శకత్వం లో జై సింహా అనే సినిమా చేసాక, రవికుమార్ సినిమాని తీసిన విధానం నచ్చి బాలకృష్ణ ఈ దర్శకుడికి ఇంకో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. అయితే రవికుమార్ కొంత సమయం తీసుకొని ఒక నూతన కథ ని సిద్ధం చేసుకొని మళ్ళీ బాలకృష్ణ ని అప్రోచ్ అయ్యాడు. బాలయ్య బాబు కి కథ వెంటనే నచ్చడం తో, వెంటనే నిర్మాత కళ్యాణ్ ని పిలిచి సినిమా ఒకే చేయించాడు. కాకపోతే ఈ సినిమా ని ఇప్పటికే అధికారికం గా అనౌన్స్ చేసినా, షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కి విడుదల చేయాలి అనుకున్నారు దర్శక నిర్మాతలు.

కాకపోతే ఇప్పుడు చూస్తే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు, అప్పుడే మహేష్ బాబు, అల్లు అర్జున్ తమ సినిమాలు సంక్రాంతి కే వస్తాయి అని ప్రకటించడం తో, ఎందుకొచ్చిన గొడవ లే అనుకోని బాలకృష్ణ తన సినిమా ని ఫిబ్రవరీ లేక మార్చ్ నెలలో విడుదల చేద్దాం అని తన నిర్మాత కి చెప్పాడట. సో బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసు లో లేనట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -