ఈగ సినిమా లో తీరని కల ఈ సినిమాతో నెరవేరింది అంటున్న నాని

- Advertisement -

హాలీవుడ్ సినిమా ‘ది లయన్ కింగ్’ ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా లో సింబా పాత్రకు నాచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా నాని కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ నాని రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘ఈగ’ సినిమా గురించి చెప్పాడు. ఈగ సినిమాలో తాను చేయలేకపోయినది ‘ది లయన్ కింగ్’ సినిమాలో చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

“నాకు ఎప్పటినుంచో ఒక అనిమేషన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పాలని ఉండేది. అదే సమయంలో ‘ఈగ’ సినిమా కి నేను సైన్ చేసినప్పుడు నా కల నెరవేరబోతుందని సంతోషించాను. కానీ రాజమౌళి గారు అసలు ‘ఈగ’ సినిమాలో నా పాత్రకు డైలాగ్స్ లేవని చెప్పారు. అలా అప్పుడు నా కల కలగానే మిగిలిపోయింది. కానీ ఇన్నాళ్లకు ‘ది లయన్ కింగ్’ సినిమాతో అది నెరవేరింది” అని చెప్పుకొచ్చాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా జులై 19న విడుదల కాబోతోంది. మరోవైపు నాని త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -