Wednesday, May 8, 2024
- Advertisement -

మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న బాల‌య్య‌

- Advertisement -

నంద‌మూరి హీరో బాల‌య్య మళ్లీ పెళ్లిపీటలెక్కారు.ఈ వయసులో బాలయ్య పెళ్లి ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ అది సినిమా కోసం చేసుకున్న రీల్ పెళ్లి. బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ లో భాగంగా పెళ్లి పీటలెక్కాడట బాలయ్య. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అనే పేర్లతో రెండు భాగాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కథలో భాగంగా ఎన్టీఆర్ జీవితంలోని పలు కీలక ఘట్టాలను చూపించబోతున్నారు. ఈ క్రమంలో బాలయ్య పెళ్లి వేడుక సన్నివేశం కూడా సినిమాలో చూపించనున్నారు. ఇందులో భాగంగానే నిన్న(శుక్రవారం) బాలయ్య బాబుని పెళ్లి పీటలెక్కించి పెళ్లి సన్నివేశాలను చిత్రీకరించారట.ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది. రానా, రకుల్ ప్రీత్ సింగ్, సుమంత్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -