Saturday, May 4, 2024
- Advertisement -

తమిళ డైరెక్టర్ ని ఇరకాటం లో పెట్టిన బాలయ్య

- Advertisement -

నందమూరి బాలకృష్ణ రెండో సారి కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో ఒక కొత్త సినిమా ని చేయాలి అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఈ సినిమా గురించి అధికారికం గా కూడా చెప్పేసారు నిర్మాత కళ్యాణ్. సినిమా ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ పనులు కూడా చకచకా మొదలయ్యాయి. అయితే ఇంకో వారం లో షూటింగ్ మొదలు కాబోతుంది అనే టైం కి సినిమా కాస్త వాయిదా పడింది. మళ్ళి మొదలు కాబోతుంది అనుకుంటున్న సమయం లో సడన్ గా సినిమా ఉండబోదు అనే వార్తలు వస్తున్నాయి. అయితే కథ లో కొన్ని మార్పులు చేస్తే అంతా సెట్ అవుతుంది అనే ఉదేశ్యం తో దర్శక నిర్మాతలు ఉండగా ఎందుకో ఈ కథని మొత్తానికే బాలయ్య వద్దు అనుకుంటున్నాడట.

ఆ ఆలోచన తో నే బోయపాటి శ్రీను కి మళ్ళి కబురు పెట్టాడట. అయితే మళ్ళి బోయపాటి అన్ని వదిలేసుకొని బాలయ్య కోసం సినిమా చేయాలి అని వచ్చే టైం కి రవికుమార్ ఇంకో కథ చెప్పి బాలకృష్ణ ని లాక్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇలా ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో ఎవరితో సినిమా చేస్తాడో చెప్పకుండా బాలకృష్ణ మాత్రం ఇద్దరినీ బాగా టెన్షన్ పెడుతున్నాడు అని టాక్.

అయితే అసలు ఏం సినిమా చేయాలి అనే విషయం లో బాలయ్య కె ఒక క్లారిటీ లేదు అనే విషయం కూడా వినిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -