Thursday, May 16, 2024
- Advertisement -

జ‌గ‌న్ మాస్ట‌ర్ స్ట్రోక్‌….బిల్లు చెల్లింపులపై ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసె స‌మ‌యంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో పేరుకుపోయిన అవినీతిని ప్ర‌క్షాల‌న చేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ మొద‌టి అడుగు వేశారు. త‌న ల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. సీఎంవోలో న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు అవినీతి నిర్మూల‌ణ‌పై మొద‌టి అడుగు వేశారు. దీంతో టెండ‌ర్లు ద‌క్కించుకోని ప‌నులు మొద‌లు పెట్ట‌ని కాంట్రాక్ట‌ర్ల గుండెల్లో గుబులు మొద‌ల‌య్యింది.

కాంట్రాక్టుల్లో అవినీతి నివారణకు అన్ని శాఖలకు ఏపీ సీఎస్‌ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో నిధులు వ్యయం, బిల్లుల మంజూరుపై స్పష్టతనిస్తూ మెమో జారీ చేశారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితులు పట్టించుకోకుండా మంజూరు చేసిన ఇంజనీరింగ్ పనులు రాష్ట్ర ఖజానాపై భారం పడేలా చేశాయని మెమోలో పేర్కొన్నారు.

ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన కొన్ని ప్రాజెక్టు పనుల్ని కూడా సమీక్షించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దిగజారుతున్న ఆర్థిక వనరులు.. ఆర్ధికంగా ఆనాలోచిత నిర్ణయాలను ఉదహరిస్తున్నాయని ఉత్త‌ర్వుల్లో చెప్పారు.2019 ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై ఇంకా ప్రారంభించని పనుల్ని రద్దు చేయాలని ప్రభుత్వ శాఖలకు సూచించారు. 25 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టుల విషయంలో విలువను తాజాగా నిర్ధారించి.. తదుపరి చెల్లింపులు చేయొద్దని స్పష్టం చేశారు.

జీరో కరప్షన్‌ మోడ్‌తో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టుల్లో అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు.అధికారులు తాజా నిబంధనల ప్రకారం ధృవీకరించిన పనులకు మాత్రమే చెల్లింపులు చేయాలని పే అండ్ ఆకౌంట్స్ కార్యాలయానికి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -