Tuesday, May 14, 2024
- Advertisement -

జైసింహా ట్రైలర్ రివ్యూ……. రొటీన్, రొడ్డకొట్టుడు, జంబూబాం సినిమా

- Advertisement -

బాహుబలి కలెక్షన్స్‌తో తెలుగు సినిమా బాలీవుడ్‌ని దాటేసింది. ఘాజీలాంటి సినిమాలతో కంటెంట్ ఈజ్ ద కింగ్ అని నిరూపిస్తున్నారు యువ దర్శకులు. ఇక నాగార్జున, వెంకటేష్‌లాంటి సీనియర్ హీరోలు కూడా కొత్తగా ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్‌లాంటి ఊరమాస్ హీరో కూడా పంథా మార్చి నాన్నకు ప్రేమతో లాంటి క్వాలిటీ సినిమాలు అందించాడు. ఇక ఇతర హీరోలందరూ కూడా కొత్తగా, క్వాలిటీ సినిమాలు ట్రై చేస్తున్నారు. కానీ ఒక్క బాలకృష్ణ మాత్రం రొటీన్ రొడ్డకొట్టుడు తొడగొట్టుడు సినిమాలు చేస్తూ తెలుగు సినిమాని పాతాళానికి తీసుకెళ్తున్నాడు.

జైసింహా ట్రైలర్‌లో ఏముంది? ఈ ట్రైలర్ చూశాక సినిమాలో ఏముందని ప్రేక్షకులు అనుకోవాలి? బాహుబలి సినిమాతో బాలీవుడ్‌లో వచ్చిన గొప్ప పేరు కాస్తా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్‌లాంటి సినిమాలతో ఉసూరనిపించింది. ఇక చాలా మంది యువ దర్శకులు కొత్తగా ట్రే చేస్తూ తెలుగు సినిమాలలో కూడా క్వాలిటీ ఉంటుంది. మంచి కథ ఉంటుంది అని నిరూపిస్తూ తెలుగు సినిమాకు పేరు తెస్తుంటే బాలకృష్ణ మాత్రం తన సినిమాలతో ఇతర భాషల ప్రేక్షకులు, ఇతర భాషల సినిమావాళ్ళూ తెలుగు ఇండస్ట్రీపై జోకులు వేసేలా చేస్తున్నాడు. ఆల్రెడీ తెలుగునాట బాలయ్య నటనపై, బాలయ్య సినిమాలపై సెటైర్స్ అన్నీ ఇన్నీ కాదు. ఇక ఇప్పుడు ఈ జైసింహా వాటన్నింటినీ తలదన్నేలా ఉంది. హరిప్రియ లాంటి టీనేజ్ హీరోయిన్‌తో బాలయ్య రొమాన్స్ చూస్తుంటే ఏమని స్పందించాలో కూడా తెలియని పరిస్థితి. ఇక నయనతార చేత బాలయ్య వయసు ఎప్పటికీ అయిపోదు అని డైలాగ్ చెప్పించిన డైరెక్టర్‌కి, ఆ డైలాగ్‌కి ఒప్పుకున్న బాలయ్యకు పాదాభివందనాలు చెయ్యాలేమో.

చివరగా ‘నియ్యమ్మ’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అయితే ఎంత సంస్కారవంతంగా ఉందో? ఒక ప్రజాప్రతినిధి నోటి నుంచి వచ్చిన ఆణిముత్యం లాంటి డైలాగ్ అని మురిసిపోవాలేమో. ఇక ఈ సినిమా గురించి బాబుగారి ముద్దుబిడ్డ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు పొగిడిన విధానం అయితే నభూతో అని చెప్పాలి. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తూ ఉంటే ఇలానే ఉంటుందేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -