Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌ను అలా…. బాలయ్యను ఇలా…. నందమూరిపై నారావారి రాజకీయం

- Advertisement -

చంద్రబాబునాయుడి రాజకీయ వ్యూహాల ముందు ఉద్ధండులైన రాజకీయ నాయకులే నిలబడలేకపోయారు. ఎన్టీఆర్‌లాంటి సినీ సామ్రాజ్య విజేత, సరికొత్త రాజకీయ చరిత్రను సృష్టించిన ఎన్టీఆర్ కూడా చంద్రబాబు రాజకీయ వ్యూహాల ముందు నిలబడలేకపోయాడు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆ వ్యూహాలను దారుణమైన కుట్రలుగా తేల్చిచెప్తూ ఉంటారు. ధైర్యంగా పోరాడి గెలవడం బాబు హిస్టరీలోనే లేదు. చీకట్లో చిదంబర రహస్యం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైనా, విభజన నాటి టైంలో సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు అహ్మద్ పటేల్‌తో సుజనా చౌదరి సీక్రెట్ మీటింగ్ అయినా, జగన్‌ని ఎదుర్కోవడానికి అప్పటికప్పుడు పవన్ చేత పార్టీ పెట్టించడం అయినా…అన్నీ కూడా సీక్రెట్‌గా ఉంటాయి. తెరవెనుక కుట్రలుగానే ఉంటాయి. ఎలా అయితేనేం అధికారంలోకి రావడంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు. అయితే మోడీని అరెస్ట్ చేయిస్తానన్న బాబు…..అదే మోడీతో జతకట్టి…..ఆంద్రప్రదేశ్‌ని ఎక్కడికో తీసుకెళ్తాం….మోడీకి. నాకు ఓటెయ్యండి అని చెప్పి……ఓట్లు పడ్డాక మాత్రం కనీసం ఎపి ప్రజలకు చట్టబద్ధంగా రావాల్సిన వాటికి మంగళం పాడేశాడు. తాను ఇచ్చిన రుణమాఫీ హామీలతో పాటు, మోడీ నుంచి రావాల్సిన హోదా, జోన్‌లాంటి వాటిని కూడా ఎవరూ డిమాండ్ చేయకుండా బాబే తొక్కేశాడు. అలాంటి వ్యూహ చతురుడి ముందు నందమూరి వారు ఎంత?

అందుకే ఎన్టీఆర్‌ని పూర్తిగా టిడిపి నుంచి దూరం చేశాడు. కాస్త కష్టజీవి కాబట్టి సినిమాల్లో కూడా తొక్కేయాలన్న కుట్రలను జయించి టెంపర్ సినిమా నుంచీ ట్రెండ్ మార్చి మరీ అందరి ప్రేక్షకులకూ చేరువయ్యాడు ఎన్టీఆర్. ఆ రకంగా రాజకీయాల్లో తొక్కేసినా సినిమా ఫీల్డ్‌లో మాత్రం తన కెరీర్ కాపాడుకున్నాడు. మళ్ళీ టాప్ రేంజ్‌కి వచ్చాడు. అయితేనేం ఇప్పుడు 2017 సినిమా రివ్యూ అంటూ టిడిపి రెండు భజన మీడియాలో వస్తున్న వార్తలు చదువుతుంటే ఎన్టీఆర్ విషయంలో వాళ్ళు చేసిన ప్రయత్నం నవ్వు తెప్పించేలా ఉంది. చిరంజీవితో సహా అందరు హీరోల గురించి ప్రత్యేకంగా ఫొటో వేసి మరీ రాస్తున్నవాళ్ళు …….ఎన్టీఆర్ గురించి మాత్రం లోపల వార్తలో రెండు వాక్యాల్లో తేల్చేస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణను కూడా లోకేష్ కంటే చిన్నవాడిని చేయడం, అలాగే బాలకృష్ణను పూర్తిగా రాజకీయాల్లో లేకుండా చేసే ప్రయత్నం మొదలెట్టాడు నారావారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని టిడిపి వారే చెప్తున్నారు. అలాగే ఇప్పుడు జైసింహా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి లోకేష్‌ని ఛీఫ్ గెస్ట్‌ని చేశారు. నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ రేంజ్ హీరో సినిమాకు నారా లోకేష్ ఛీఫ్ గెస్ట్ అన్నమాట. ఇక బాలయ్యతో సహా మిగతా అందరూ కూడా ఈ ఛీఫ్ గెస్ట్‌ని ఓ స్థాయిలో పొగిడేయాలి. బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చేసరికి….ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మందికి పదవులు ఇచ్చారన్న అపవాదు వస్తుందన్న చంద్రబాబు……లోకేష్‌కి మాత్రం రెండు ప్రధాన మంత్రి పదవులను కట్టబెట్టాడు. ఎదుటి వాళ్ళకు చెప్పడానికి నీతులు ఉంటాయి….లోకేష్‌కి మాత్రం ఆ నీతుల నుంచి మినహాయింపు ఉంటుంది. రేపు పరిస్థితులు ఎటుండి ఎటు వచ్చినా టిడిపికి చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా లోకేష్ తప్ప ఇంకెవరూ కనిపించకూడదు అన్నది చంద్రబాబు ప్రయత్నం. ఎన్టీఆర్‌పై జగన్ మనిషి అన్న ముద్ర వేసి తప్పించిన చంద్రబాబు……బాలయ్యను లోకేష్ కంటే తక్కువ సామర్థ్యం కలిగినవాడిగా, రాజకీయాలు తెలియనివాడిగా ప్రచారం చేయించి పడేశాడు. నారా లోకేష్‌ని మాత్రం సమర్థుడైన నాయకుడిగా అనుక్షణం భజన మీడియాలో జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ జైసింహా సినిమా ఫంక్షన్ తర్వాత ఆ యజ్ఙం పరిపూర్ణం అవుతుందనడంలో సందేహం లేదు. చంద్రబాబా? మజాకానా? కాకపోతే ఎన్ని చేసినా ఎన్టీఆర్ ప్రజల్లోకి వస్తే మాత్రం లోకేష్ తేలిపోవడం ఖాయం కాదా? 2009లో ఎన్టీఆర్ ప్రసంగాలు, వాటికి జన ప్రభంజనం నుంచి వచ్చిన స్పందన చూసినవాళ్ళు ఎవరైనా సరే……ఎన్టీఆర్ ముందు లోకేష్ నిలబడగలడు అని చెప్పగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -